ప్రేమ గుడ్డిది. Love is blind!
కొత్తగా ప్రేమలో పడ్డవాళ్ళకి ఎవరైనా ప్రేమ గుడ్డిది అనేవాళ్ళని చూస్తే 'పాపం.. గుడ్డి వాళ్ళు!' అని జాలిగా అనిపిస్తుంది.
వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్లకేమో ఆ ప్రేమలో పడ్డ వాళ్ళే గుడ్డివాళ్లలా కనిపిస్తుంటారు.
అసలైతే నిజంగా ప్రేమ గుడ్డిదే! కాకపోతే అసలేమీ కనిపించని గుడ్డితనం కాకుండా colour blindness లాంటిదన్నమాట!
ఆ సదరు ప్రేమలో పడిన వ్యక్తికి మాత్రమే కొంతమేరకు ప్రపంచమంతా కొత్త కొత్త రంగుల్లో కనిపిస్తుంటుంది.
కాకపోతే, యీ రకమైన గుడ్డితనం జీవితాంతం ఉంటే, అంతా హ్యపీసే!కొన్నాళ్ళకి గుడ్డితనం పోయి ప్రేమించిన వ్యక్తిలో మామూలు రంగులు కనిపించాయనుకోండి. అప్పుడే వస్తుంది అసలు తంటా!
యీ గుడ్డితనం కాస్తా ఒకళ్ళకి వచ్చి ఇంకొకళ్ళకి రాలేదనుకోండి.. మళ్ళీ అదొక సమస్య. ఆ సదరు వ్యక్తికి కళ్ళు పోయేలా చేయడానికి.. అదేనండీ గుడ్డితనం తీసుకురాడానికి.. అదేనండీ ప్రేమలో పడెయ్యడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది పాపం! మళ్ళీ అదొక పెద్ద ప్రహసనం అవ్వచ్చు, హింసాత్మకం కూడా అవ్వచ్చు. చెప్పలేం మరి!
అన్నట్టు, రెడీమేడ్ గుడ్డితనం అని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అదేంటంటే, నాకు ఫలానా విషయం ఫలానా రంగుల్లో కనపడుతోంది అని గుడ్డిగా ఊహించేసుకుని గుడ్డితనం తెచ్చేసుకోడం అన్నమాట. ఉదాహరణకి అమ్మాయితో పాటు లక్షల ఆస్తి కట్నం వస్తుంది అంటే అమ్మాయి అతిలోకసుందరిలా కనిపించడంlove, లేదా అబ్బాయి కోటీశ్వరుడు అని తెలిస్తే నవమన్మథుడిలా కనిపించడం.. వగైరా లాంటివన్నమాట!
ఇదంతా బానే ఉంది గానీ, మరి పెళ్ళంటే ఏంటి? అన్న సందేహం వచ్చేస్తోంది కదూ మీకు! వస్తున్నా.. వస్తున్నా.. అక్కడికే వచ్చేస్తున్నా!
ఏమీ లేదండీ. వెరీ సింపుల్.. యీ యొక్క సదరు గుడ్డితనాన్ని జీవితాంతం, చిరకాలం ఉండేలా కాపాడుకోడానికి ఇద్దరు గుడ్డివాళ్ళు చేసే గుడ్డి ప్రయత్నమన్నమాట!
ముందే చెబుతున్నాను. యీ గుడ్డి పోస్టు చూసి inspire అయ్యి ఎవరైనా గుడ్డివాళ్ళయిపోదాం అనుకుంటే నా పూచీ లేదోచ్!
అసలీ గుడ్డి గోల ఏంటీ అనుకుంటున్నారా? యీ రోజు పొద్దున్నే ఏకాంతపు దిలీప్ గారి 'బజ్' లో "ప్రేమంటే ఏంటి?" అని చూసి Love is blind! అని కామెంట్ పెట్టాను. అలా అలా ఆలోచిస్తుంటే, సరదాగా ఇలా అనిపించింది! అదన్నమాట యీ గుడ్డి పోస్టు వెనక ఉన్న గుడ్డి కారణం!
ANITHA O ANITHA
పల్లవి || నా ప్రాణమా నను వీడిపోకుమా... నీ ప్రేమలో నను కరగనీకుమా పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తుంది వద్దనా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత.. అనితా.. అనిత ఓ వనిత.... నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓహ్.. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చికుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నను కలవరపరిచేనే , కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే , నువ్వొకచోటా నేనోకచోటా, నిను చూడకుండానే క్షణముండలేనుగా , నా పాటకి ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే , నా ఆశల రాణివి నీవే, నా గుండెకి గాయం చేయకే..ఎహ్.. అనిత.. అనితా ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచ, ప్రతి క్షణము ధ్యానిస్తు పసిపాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకు ఎదురు చూసేను, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకేఅని అంటుందే, కరునిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే, నే శిలను అవతానే.. నను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరివాన్ని చేయకే.. ఎహ్.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఏదో రోజు నాపై నీ.. ప్రేమ కల్గుతుందని ఒక్క చిన్ని ఆశ నాలో సచ్చే అంత ప్రేమ మదిలో, ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్న ||2|| ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు, నిను ప్రేమిస్తూనే ఉంటా.. అనిత.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా||
No comments:
Post a Comment