నువ్వు ఎప్పుడో శిథిలమైన గతానికి ప్రతీకవని నేననుకున్నాను.
ఏదీ ధైర్యంగా నాలోకి ఓ మాటు తొంగి చూసి చెప్పమని నా మనసు నిలదీసింది.
నాలో నువ్వు లేవని దాన్ని నమ్మించడానికి విఫలయత్నం చేశాను.
మనసు పోరుకి ఎదురు నిలవలేక ఏవో నిశివీధుల్లో తప్పించుకు తిరిగాను.
నేను నిమిత్త మాత్రురాలిని అన్నట్టు కాలం తన రంగులు మారుస్తూ కరిగిపోతూనే ఉంది.
గుండెలో ఏ మూలనో రహస్యంగా దాగిన మధుర జ్ఞాపకాలు ఉన్నట్టుండి నిద్ర లేచాయి.
ఇన్నాళ్ళూ మా జాడ మరచినట్టు భ్రమపడుతున్నావు కదూ అని నన్ను ప్రశ్నిస్తున్నాయి.
కరిగిపోయింది కేవలం కలేనని చెప్పి మనసుని మాయ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను.
కల కాదు నే కోల్పోయింది మరెన్నటికీ తిరిగిరాని అమూల్యమైన ప్రేమనీ అది వాదిస్తోంది.
వేదనతో ఘనీభవించిన నా మనసుని వెచ్చటి కన్నీళ్ళలో కరిగించెయ్యాలని ఉంది.
నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయిన నా అమాయకత్వానికి నవ్వొస్తోంది.
నిన్ను చేజార్చుకున్న నా పిచ్చితనానికి జాలేస్తోంది.
నిన్నందుకోలేకపోయిన నా దురదృష్టానికి కోపమొస్తోంది.
నిన్ను చేరుకోలేని నా అశక్తతకి ఏడుపొస్తోంది.
నిరంతరం వెంటాడుతున్న నీ తలపుల నుంచి దూరంగా పారిపోడానికి ప్రయత్నిస్తూ అలసిపోతున్నాను.
నా మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న నీ స్మృతుల్ని తుడిచెయ్యలేక ఓడిపోయి సోలిపోతున్నాను.
ఇప్పుడు కూడా నువ్వు పంచిన అప్పటి జ్ఞాపకాలే నా తోడుగా నిలబడి నా మనసుకి ఊపిరి పోస్తున్నాయి!
ANITHA O ANITHA
పల్లవి || నా ప్రాణమా నను వీడిపోకుమా... నీ ప్రేమలో నను కరగనీకుమా పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తుంది వద్దనా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత.. అనితా.. అనిత ఓ వనిత.... నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓహ్.. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చికుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నను కలవరపరిచేనే , కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే , నువ్వొకచోటా నేనోకచోటా, నిను చూడకుండానే క్షణముండలేనుగా , నా పాటకి ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే , నా ఆశల రాణివి నీవే, నా గుండెకి గాయం చేయకే..ఎహ్.. అనిత.. అనితా ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచ, ప్రతి క్షణము ధ్యానిస్తు పసిపాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకు ఎదురు చూసేను, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకేఅని అంటుందే, కరునిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే, నే శిలను అవతానే.. నను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరివాన్ని చేయకే.. ఎహ్.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా|| చరణం|| ఏదో రోజు నాపై నీ.. ప్రేమ కల్గుతుందని ఒక్క చిన్ని ఆశ నాలో సచ్చే అంత ప్రేమ మదిలో, ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్న ||2|| ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు, నిను ప్రేమిస్తూనే ఉంటా.. అనిత.. అనిత.. అనితా.. ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ||నా ప్రాణమా||
No comments:
Post a Comment